వచ్చే ఏడాది(2024) జరగబోయే మేడారం సమ్మక్క, సారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం బుధవారం (మే 3న) ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం) రోజున మండ మెలగడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పూజారులు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 21న బుధవారం రోజు సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు
ఫిబ్రవరి 22న గురువారం రోజున సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు
ఫిబ్రవరి 23న శుక్రవారం రోజున శ్రీ సమ్మక్క సారాలమ్మ దేవతలకు, శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు దేవుళ్లకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు.
ఫిబ్రవరి 24న శనివారం రోజున శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలు, శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు దేవుళ్లు వనప్రవేశం చేస్తారు.
ఫిబ్రవరి28న బుధవారం తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. దాంతో సమ్మక్క సారలమ్మ జాతర ముగిస్తుంది.