నా దుస్తులు అమ్మి ప్రజలకు చౌకగా గోధుమపిండి అందిస్తా

  • పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు 

వచ్చే 24 గంటల్లో 10 కిలోల గోధుమ పిండి బస్తా ధరను తగ్గించకుంటే తన బట్టలను అమ్మి అయినా ప్రజలకు తక్కువ ధరలో అందిస్తానని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్‌ ఖాన్‌ (ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన సీఎం)కి తన నిర్ణయాన్ని తెలిపారు. 10 కేజీల గోధుమ పిండి బ్యాగును 24 గంటల్లో రూ.400కు తగ్గించాలని అల్టిమేటం జారీ చేశారు. 

పాకిస్థాన్ లోని థకారా స్టేడియంలో ఆదివారం (మే 29వ తేదీన) జరిగిన బహిరంగ సభలో ప్రధాని షరీఫ్‌ ఈ కామెంట్స్ చేశారు. దేశంలో ధరల పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దేశానికి నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని కానుకగా ఇచ్చారంటూ ఆరోపించారు. దాదాపు 50 లక్షల ఇండ్లు, కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి విఫలమైన ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారంటూ ఆరోపించారు. తాను దేశ శ్రేయస్సు కోసం ప్రాణాలర్పించడమే కాకుండా అభివృద్ధి పథంలో పాక్ ను ఉంచుతానని షరీఫ్‌ బహిరంగంగా ప్రకటించారు.

బలూచిస్తాన్‌ ఎన్నికల గురించి మాట్లాడుతూ ప్రజలకు తనపై విశ్వాసం ఉందని, తనకు అనుకూలంగా ఓట్లు వేయడానికి పోలింగ్‌ బూత్‌లకు తరలి వచ్చారని షరీఫ్‌ అన్నారు. ఇక దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరగడానికి ఇమ్రాన్ ఖాన్ కారణమని ఆరోపించారు. అంతేకాదు షరీఫ్ తన సోదరుడు, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. ఆ సభలో పీఎంఎల్ ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ కూడా ప్రసంగించడమే కాకుండా తన తండ్రి నవాజ్‌ షరీఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

పాకిస్థాన్ లో ఇటీవల ఏర్పడిన నూతన ప్రభుత్వాన్ని సవాళ్లు వెంటాడూతేనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణంతో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరడగంతో పాటు నిరుద్యోగ సమస్యలతో పాకిస్థాన్ అష్టకష్టాలు పడుతోంది. ఈ క్రమంలో ధరలను అదుపు చేయడంలో స్థానిక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

మరోవైపు అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.180. డీజిల్ ధర రూ.174కి చేరాయి. 

మరిన్ని వార్తల కోసం..

నీరజ్ పన్వార్ కుటుంబసభ్యులను కలిసిన సీవీ ఆనంద్

కేసీఆర్ ఊసరవెల్లి