
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పరిష్కరించి, రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బకాయిలు చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసోసియేషన్సభ్యులు మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టారు.
మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, వీఎస్ రావు, ఎం.ఎన్.రెడ్డి, ఆంజనేయులు, కృష్ణమూర్తి హాజరై మాట్లాడారు. నాలుగేండ్లుగా ఈ– కుబేర్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్చి 2024లో రిటైర్ అయిన వారికి ఏడాదిగా బెనిఫిట్స్చెల్లించడం లేదన్నారు.