హైదరాబాద్: తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 2024, నవంబర్ 5వ తేదీ నుండి టెట్ అప్లికేషన్ల ప్రాసెస్ మొదలవగా.. శనివారం (నవంబర్ 17) వరకు మొత్తం 1,26,052 అప్లికేషన్లు వచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది. ఇందులో పేపర్ 1కు 39,741 మంది, పేపర్ -2కు 75,712 మంది.. పేపర్-1, 2కు కలిపి 10,599 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల (నవంబర్) 20 దరఖాస్తులకు చివరి తేదీ కాగా.. చివరి రోజే కాకుండా కొంచెం ముందే అప్లికేషన్స్ చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ | సీబీఐలో అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
చివరి రోజు ఒకేసారి అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునేందుకు ఎగబడితే.. సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. అందుకే దరఖాస్తు డెడ్ లైన్‌కు ముందుగానే అప్లై చేసుకోవడం బెటరని సూచిస్తున్నారు. కాగా, ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి టెట్‌ను 2024 జూన్‌లో నిర్వహించారు. రెండోసారి టెట్ 2025 జనవరిలో కండక్ట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 2025 జనవరి 1 నుంచి 20 వరకు ఆన్ లైన్లో టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.