Vishwambhara: చిరంజీవి ‘రామ..రామ’ పాట కోసం.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే?

Vishwambhara: చిరంజీవి ‘రామ..రామ’ పాట కోసం..  ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే?

హనుమాన్ జయంతి (2025 ఏప్రిల్ 12) సందర్భంగా విశ్వంభర ఫస్ట్ సింగిల్ ‘రామ... రామ...’రిలీజ్ చేశారు. కీరవాణి స్వరపరిచిన ఈ భక్తి గీతం శ్రోతలను అలరిస్తుంది. చిరంజీవిపై తెరకెక్కించిన ‘రామ‌..రామ‌’(Rama Raama) పాటకు మేకర్స్ భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేశారట. ఎంతో కలర్ ఫుల్గా, గ్రాండియర్ గా ఉన్న ఈ పాట సినిమాకే హైలెట్ కానుందని టాక్.

అంతేస్థాయిలో 4 భారీ సెట్స్‌ వేసి దాదాపు 12 రోజుల పాటు ఈ పాట‌ని షూట్ చేశారట. ఈ పాట‌లో 400 మందికి పైగా డ్యాన్స‌ర్లు, 400 మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్‌లు, 15 మంది న‌టీన‌టులు పాల్గొనున్నట్లు సమాచారం. ఈ పాటకి 'సరస్వతీపుత్ర' రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. శంకర్ మహదేవన్, లిప్సిక పాడారు.

'తయ్యతక్క తక్కధిమి చెక్కభజనాలాడి..రాములోరి గొప్ప చెప్పుకుందామా..'నీ గొంతు కలిపి మా వంత పాడగ.. రావయ్య అంజని హనుమా..' వంటి పదాలను రామజోగయ్య శాస్త్రి చక్కగా పొందుపరిచారు.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు. అషిక రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

►ALSO READ | HIT3Trailer: నాని భీకర వైలెన్స్‌.. RRR రికార్డులను బద్దలు కొట్టిన హిట్ 3 ట్రైలర్..