పుచ్చ రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

నాణ్యతలేని నాసిరకం పుచ్చ విత్తనాలు అమ్ముతున్న వారిపై వ్యవసాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొండ జిల్లాలో రైతులతో కలిసి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా  చేశారు. రశీదులు ఇవ్వకుండా నాసి రకం పుచ్చ విత్తనాలు అమ్ముతున్న వారి పై పీడీ యాక్టు పెట్టాలని సూచించారు.  

ఇటువంటి నాసిరకం విత్తనాల వల్ల అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పుచ్చసాగు చేసినా కాత, పూత లేకుండా నష్టపోతున్నారని చెప్పారు.  వారిని పలువురు వ్యాపారులు మోసం చేశారని ఆరోపించారు. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్ఠ పరిహారం చెల్లించకుండా,తాత్సారం చేస్తున్న కర్షక్ మైక్రో ఇరిగేషన్ సిస్టం యజమాని పై,DCS జిగ్నా గోల్డ్ కంపెనీ పై  కేసులు నమోదు చేయాలని కోరారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి మూడు లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.