మనం పాములు, కొండచిలువల పేర్లు వినగానే వణికిపోతాం. అందునా భారీ వర్షాల నేపథ్యంలో జలాశయాల్లో కొండ చిలువలు హల్ చల్ చేస్తున్నాయి.హిమాయత్ సాగర్ జలాశయంలో కొండచిలువ కలకలం రేపింది. హిమాయత్ సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు వద్ద కొండ చిలువ ఇరుక్కుంది. తీవ్ర ఇబ్బందులు పడుతున కొండ చిలువను గుర్తించిన జలమండలి సిబ్బంది స్నేక్ క్యాచర్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Also Read :- సాగర్ ప్రాజెక్ట్ 20 క్రస్ట్ గేట్లు ఓపెన్
హిమాయత్ సాగర్ జలాశయం వద్దకు వచ్చిన స్నేక్ క్యాచర్స్ కొండ చిలువను రక్షించారు. క్రస్ట్ గేట్ వద్దకు వెళ్లి.. కొండచిలువ నోటిని పట్టుకుని తాడు సాయంతో కొండచిలువను తీసుకొని పైకి వచ్చారు. తరువాత జలమండలి అధికారులు, స్నేక్ క్యాచర్లు కొండ చిలువను జూ అధికారులకు అప్పగించారు.