పట్టాల పొంటి నడిచారని గుంజీలు తీయించారు

గోవా–కర్నాటక సరిహద్దుల్లోని ఫేమస్  దూద్ సాగర్  జలపాతం చూసేందుకు వెళ్లిన ట్రెక్కర్లతో రైల్వే పోలీసులు గుంజీలు తీయించారు. ముందు స్టేషన్​లోనే దిగి రైల్వే ట్రాక్​ వెంట నడిచి వెళుతుండగా ఆపి ఈ శిక్ష విధించారు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో దూద్ సాగర్  జలపాతం చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.  కర్నాటకలోని బెంగళూరు, మంగళూరు, బెళగావి, ఉత్తర కన్నడ, హుబ్బళ్లి, ధార్వాడ, బాగల్ కోట్​లతో పాటు మహారాష్ట్రలోని పుణె నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. దక్షిణ గోవాలోని కొల్లమ్  స్టేషన్ లో దిగిన తర్వాత పర్యాటకులు దూద్ సాగర్  జలపాతానికి చేరుకునేందుకు రైల్వే ట్రాక్​ల వెంట నడుస్తున్నారు. దీంతో ట్రాక్ పై వచ్చే రైళ్లకు అంతరాయం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో ట్రాక్ లపై, ట్రాక్ ల వెంట పర్యాటకులు నడవకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. అతిక్రమించి నడిచిన వారిని పట్టుకుని ఇలా గుంజీలు తీయించారు. 

ALSO READ:పతంజలిలో ఇన్వెస్ట్ చేసిన అదానీ ఇన్వెస్టర్‌‌‌‌