IND vs AUS 3rd Test: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. తొలి రోజు 13.2 ఓవర్లే

IND vs AUS 3rd Test: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. తొలి రోజు 13.2 ఓవర్లే

గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ తొలి రోజు ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశపరిచింది. మ్యాచ్ మొదటి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలి సెషన్ లో మాత్రమే మ్యాచ్ జరగగా.. రెండు, మూడు సెషన్స్ పూర్తిగా వర్షం కారణంగా తుడిచిపెట్టుకొని పోయాయి. తొలి రోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. నాథన్ మెక్‌స్వీనీ(4), ఉస్మాన్ ఖవాజా (19) క్రీజ్ లో ఉన్నారు.

మ్యాచ్ కు రెండో రోజు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే ఈ మ్యాచ్ డ్రా అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. మెక్‌స్వీనీ, ఖవాజా పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యారు. దీంతో పరుగులు రాకపోగా.. వికెట్లు కూడా లభించలేదు. దీనికి తోడు పదే పదే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడం భారత బౌలర్లకు చిరాకు తెప్పించింది. వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ తర్వాత వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. 

Also Read :- అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

ఈ సిరీస్ విషయానికి వస్తే భారత్, ఆస్ట్రేలియా జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించగా.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ లో ఆధిక్యం సాధించాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం.