- ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరపాలని ఆదేశం
- హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
- కొనసాగుతున్న విచారణ.. త్వరలో మంత్రికి రిపోర్టు
హైదరాబాద్/ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్ మలక్‌పేట అంధ బాలికల హాస్టల్లో బాలికపై అత్యాచార ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సీరియస్అయ్యారు. ఉన్నతస్థాయి కమిటీ నియమించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. హాస్టల్వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై సీరియస్యాక్షన్తీసుకోవాలని స్పష్టం చేశారు.
బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, సత్వరమే న్యాయం అందేలా చూడాలని చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందించిన హైదరాబాద్కలెక్టర్అనుదీప్ దురిశెట్టి ముగ్గురు అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్‌గా దివ్యాంగుల సాధికారత శాఖ డైరెక్టర్, కమిషనర్ బి.శైలజ, సభ్యులుగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి డి.ఆశన్న, దివ్యాంగుల సాధికారత శాఖ అసిస్టెంట్డెరెక్టర్ ఎ.రాజేందర్ ఉన్నారు. విచారణ అనంతరం నివేదికను మంత్రి సీతక్కకు పంపనున్నారు. హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్ బి.స్వప్నను కలెక్టర్సస్పెండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లాకు చెందిన బాలిక(8) మలక్‌పేట ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్లో ఉంటూ మూడో తరగతి చదువుతోంది. కాగా, హాస్టల్బాత్రూమ్స్క్లీన్ చేసే స్కావెంజర్ నరేశ్(25) ఈ నెల 7న ఉదయం బాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గుర్తించిన వంట మనిషి పద్మ బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఆ వెంటనే తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని ఇన్చార్జ్ వార్డెన్ స్వప్న, కేర్ టేకర్ పద్మను నిలదీయగా, పాప మెచ్యూర్ అయిందని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.
అయితే అప్పటికే బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు నిలోఫర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు పాపపై అత్యాచారం జరిగిందని తేల్చారు. వెంటనే బాధిత తల్లిదండ్రులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు 16న నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 24న స్కావెంజర్ నరేశ్(25)ను అదుపులోకి తీసుకున్నారు. విషయం బయటికి రాకుండా మేనేజ్ చేశారు. మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు గురువారం హాస్టల్‌ను సందర్శించారు.