2 నుంచి గోవాలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు

2 నుంచి గోవాలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు

న్యూఢిల్లీ, వెలుగు : జనవరి 2 నుంచి 7 వరకు అఖిల భారత సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ (ఆర్ఎస్ఎస్) వెల్లడించింది. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో గోవాలో సమావేశాలు జరగనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ పరివార్ సంస్థలు హాజరుకానున్నట్లు తెలిపింది. 

బీజేపీ తరఫున బీఎల్ సంతోష్, విశ్వ హిందూ పరిషత్‌ నుంచి మిలింద్ పరండే, విద్యార్థి పరిషత్‌కు చెందిన ఆశిష్ చౌహాన్, బీఎంఎస్ నుంచి బీకే సురేంద్రన్‌తో పాటు విద్యాభారతి, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు పాల్గొననున్నారు.