గుండాల, వెలుగు : తునికాకుకు రేట్ ఖరారు చేశారు. ఆదివారం శెట్టిపల్లి గ్రామంలో ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు వివిధ పార్టీలు, సంఘాల నాయకుల ఆధ్వర్యంలో 50 ఆకుల కట్టకు 3 రూపాయల 3 పైసలుగా రేట్ ఫైనల్ చేశారు. గతంలో మూడు రూపాయల ఒక్క పైసా ఉండగా ఆదివారం జరిగిన చర్చల్లో రెండు పైసలు పెంచారు.
తునికాకు సేకరణకు వెళ్లి ప్రమాదానికి గురైతే కాంట్రాక్టర్లే పూర్తి బాధ్యత వహించాలని ఒప్పంద కాగితంలో రాసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాయల చంద్ర శేఖర్, ఎన్డీ పార్టీ రాష్ట్ర నాయకుడు అవునూరి మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొన్నారు.