ధారా రేటు తగ్గించిన మదర్​ డెయిరీ

ధారా రేటు తగ్గించిన మదర్​ డెయిరీ

న్యూఢిల్లీ: ధారా బ్రాండ్​ వంట నూనెల రేట్లను లీటరుకు రూ. 10 చొప్పున తగ్గిస్తున్నట్లు మదర్​ డెయిరీ ప్రకటించింది. వచ్చే వారం నుంచి ఈ కొత్త మాగ్జిమమ్​ రిటెయిల్​ ప్రైస్​ (ఎంఆర్​పీ) అమలులోకి వస్తుందని వెల్లడించింది.

గ్లోబల్ మార్కెట్లో వంట నూనెల రేట్ల తగ్గుదల కారణంగా రేట్ల తగ్గింపు చేపడుతున్నట్లు మదర్​ డెయిరీ పేర్కొంది. గ్లోబల్​గా వంట నూనెల రేట్లు దిగిరావడంతోపాటు, దేశంలో ఆవాలు వంటి కొత్త పంటల దిగుబడి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో తమ ధారా బ్రాండ్​ వంట నూనెల రేట్లను తగ్గిస్తున్నామని వివరించింది.