
నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "ది ప్యారడైస్". ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం "ది ప్యారడైస్" సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇటీవలే ఈ సినిమా నుంచి రా స్టేట్ మెంట్ అంటూ అప్డేట్ ఇచ్చి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. దీంతో సోమవారం క్యూరియాసిటీకి తేరా దించుతూ 1:47 నిముషాల నిడివిగల టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్..
మొదటగా సైలెంట్ బీజియంతో చరిత్రలో చిలకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి మర్చిపోయారని డైలాగ్ తో కాకులకి సంబందించిన విజవల్స్ ప్లే అవుతూ మొదలవుతుంది. తర్వాత శవాలపై కాకులు తిరుగుతున్న విజవల్స్ ని చూపిస్తూ ఇది కడుపు మండిన కాకుల కథ.. శవాల కథ అంటూ హీరో ఎలివేషన్ మొదలవుతుంది. అయితే ఇందులో హీరో నానీ ఎంట్రీ సమయంలో లం** కొడుకు కథ అంటూ వాయిస్, బీజీయం ఆసక్తిని పెంచింది.
హీరో నాని రెండు జడలతో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఎప్పుడూ నేచురల్ & ఫార్మల్ లుక్ లో కనిపించే ఈ సినిమాలో ఒక్కసారిగా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. అంతేకాదు సిక్స్ ప్యాక్ బాడీ కూడా బిల్డ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి రా స్టేట్ మెంట్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన టైటిల్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేశారు. విజవల్స్, బీజియం, నాని లుక్ ఇవన్నీ చూస్తుంటే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎదో భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే సినిమా వచ్చే ఏడాది మార్చ్ 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాని తెలుగుతోపాటూ తమిళ్, మలయాళం, హిందీ తదితర పాన్ ఇండియా భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ ఫ్యామిలీ, లవ్ & ఎమోషనల్ జోనర్స్ స్టోరీలని ఎంచుకునే హీరో నాని ఈసారి డిఫరెంట్ జోనర్ ని ట్రై చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు.