కేంద్ర మంత్రికే ఈ పరిస్థితా.. వీడియో వైరల్

కేంద్ర మంత్రికే ఈ పరిస్థితా.. వీడియో వైరల్

రోడ్ల బాగులేవు సారో అంటే ఏ ఒక్క అధికారి, నాయకుడు పట్టించుకోడు. సామాన్య ప్రజలకు ఎదురైయ్యే ఇబ్బందులు రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు వస్తే అప్పుడు అర్థమవుతుంది.. వాళ్లకు కూడా మనం పడే ఇబ్బంది. సరిగ్గా అలాంటి ఘటనే జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో జరిగింది. ఏకంగా కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న కారే రోడ్డు గుంతలో ఇరుక్కుంది.

కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రయాణించిన కారు వెనుక టైరు రోడ్డుపై ఉన్న నీటి గుంతలో దిగబడింది. కొంత సేపటి వరకు ఆ వాహనం ముందుకు కదలలేదు. దీంతో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆ కారు నుంచి కిందకు దిగారు. ఆ తర్వాత ఆయన సెక్యూరిటీ స్థానికుల సహాయంతో ఆ వాహనాన్ని రోడ్డు గుంత నుంచి బయటకు తోశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికల ప్రచారం కోసం జార్ఖండ్‌లోని బహర్‌గోరాకు కాన్వాయ్‌లో వెళ్లారు. భారీ వర్షాల కారణంగా వర్షపు నీటితో నిండిన గుంతలో ఆయన కారు టైరు ఇరుక్కుంది.

డ్రైవర్‌ ఎంత ప్రయత్నించినా కారు గుంత నుంచి బయటకు రాలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది గొడుగులు పట్టుకోగా.. కేంద్ర మంత్రి ఆ కారు నుంచి కిందకు దిగారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది స్థానికుల సహాయంతో ఆ కారును బయటకు తోశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ కారులో ఎక్కి వెళ్లారు. దీని వల్ల ఆయన కొంచెం ఆలస్యంగా బహిరంగ సభకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి చౌహాన్‌ ప్రయాణించిన కారు రోడ్డుపై గుంతలో చిక్కుకున్న వీడియో క్లిప్‌ ఎక్స్ లో వైరల్‌ అవుతుంది. నెటిజన్లు దీన్ని పై రియాక్ట్ అవుతూ.. కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ | ఛత్తీస్‎గఢ్‎లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం