‘ఆగస్టు 15’నే ఎందుకు ఎంచుకున్నారు?

‘ఇండియా ఇండిపెండెన్స్​ డే’ని చిట్టచివరి బ్రిటిష్​​ వైశ్రాయ్​, మొట్టమొదటి ‘గవర్నర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా’ లూయిస్​ మౌంట్​ బాటెన్​ నిర్ణయించారు. దీనికి ఆయన 1947లో ఆగస్టు 15ని ఎంపిక​ చేసుకున్నారు. అయితే మౌంట్​ బాటెన్​ ఈ తేదీనే ఎందుకు ఎంచుకున్నారనే దానికి వెనక ఆసక్తికర అంశం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం 1945లో ముగిసింది. ఆ ఏడాది మొదటి మూడు నాలుగు నెలల్లో యూరప్​లోని పశ్చిమ భాగంలో జర్మనీ చివరిసారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎటాక్​లు ఫెయిలయ్యాయి. మే నెలలో సోవియెట్ సేనలు జర్మనీ క్యాపిటల్​ బెర్లిన్​ను ఆక్రమించాయి. ఇది తెలిసి హిట్లర్ సుసైడ్​ చేసుకున్నాడు. ఆగ్నేయాసియా ప్రాంతంలో బ్రిటిష్ దళాలు జపాన్ సైన్యాన్ని ఓడించి తరిమేశాయి. అప్పుడు మౌంట్​ బాటెన్​.. సౌత్ ఈస్ట్​ ఏసియా అలైడ్​ ఫోర్సెస్​కి సుప్రీం కమాండర్​. ఆగస్టులో మిత్రరాజ్యాల రిక్వెస్ట్​తో సోవియెట్ యూనియన్ జపాన్ అధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియాలపై దాడి చేసి విజయం సాధించింది. జపాన్ ఆగస్టు 15న లొంగిపోయింది. దీంతో మౌంట్​ బాటెన్​ ఇండియా ఇండిపెండెన్స్​ డేని ఆగస్టు 15గా నిర్ణయించారు.