ట్రాన్స్ జెండర్ పోలీసులు వచ్చేస్తున్నారు.. స్టేడియంలో రన్నింగ్, లాంగ్ జంప్ పరీక్షలు

ట్రాన్స్ జెండర్ పోలీసులు వచ్చేస్తున్నారు.. స్టేడియంలో రన్నింగ్, లాంగ్ జంప్ పరీక్షలు

హైదరాబాద్: తెలంగాణలోని ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పోలీస్ డిపార్ట్‎మెంట్‎లో ట్రాన్స్ జెండర్ల నియామకాలు ప్రారంభించింది. తొలిసారిగా హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సెలెక్షన్ ప్రాసెస్ షూరు చేశారు. 2024, డిసెంబర్ 4న హైదరాబాద్‎లోని గోశామహల్ స్టేడియంలో పోలీస్ అధికారులు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

ఈవెంట్స్ స్కోర్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‎కు ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో నియమించనున్నారు. గోశామహల్ స్టేడియంలో జరుగుతోన్న ఈవెంట్స్ తీరును హైదరాబాద్ సీపీ సీవీ ఆనందర్ పరిశీలించారు. ఈవెంట్స్ నిర్వహణపై అధికారులతో చర్చించారు. అనంతరం పోలీసు కొలువు కోసం వచ్చిన ట్రాన్స్ జెండర్లతో కాసేపు సరదాగా సీపీ ముచ్చటించారు.

Also Read:-PSLV C-59 రాకెట్ ప్రయోగం వాయిదా

 ఈవెంట్స్‎కు సంబంధించిన వివరాలను వారికి తెలియజేశారు. కాగా, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నగరంలో వ్యభిచారం, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా సమాజంలో గౌరవంగా జీవించే విధంగా వారిని ఆదుకుంటామని ప్రభుత్వం మాట ఇచ్చింది. ఈ మేరకు పోలీస్ శాఖలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు కల్పిస్తోంది. 

తొలి రోజు 44 మంది సెలెక్ట్:

ట్రాన్స్ జెండర్ పోలీస్ నియామాకాల్లో భాగంగా తొలి రోజు మొత్తం 58 మంది అభ్యర్థులు ఈవెంట్స్‎కు హాజరయ్యారు. 18 ఏండ్లు పూర్తి అయ్యి పదవ తరగతి పాసై.. ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు పోలీసులు ఈవెంట్స్ నిర్వహించారు. అభ్యర్థులకు 800 మీటర్స్,100 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు. 29 ఉమెన్, 15 మెన్ ట్రాన్స్ జెండర్ అభ్యర్థుల ఎంపికయ్యారు. ఫస్ట్ డే మొత్తం 44 మందిని ఈవెంట్స్ తర్వాత అధికారులు సెలెక్ట్ చేశారు.