బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి

బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి
  •     కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డిని కలిసిన కార్మిక సంఘాల ప్రతినిధులు
  •     సింగరేణి జీఎంల ఆఫీస్‌‌‌‌ ఎదుట రిలే దీక్షలు

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌/నస్పూర్, వెలుగు : తెలంగాణలోని అన్ని బొగ్గు బ్లాక్‌‌‌‌లను సింగరేణికే కేటాయించాలంటూ కార్మిక సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్‌‌‌‌ యూనియన్‌‌‌‌ నాయకులు సోమవారం హైదరాబాద్‌‌‌‌లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌‌‌‌రెడ్డిని కలిశారు. బొగ్గు గనులు సింగరేణికి దక్కేలా చొరవ చూపాలని, ఇప్పటికే వేలంలో పెట్టిన కోయగూడెం ఓసీపీ 3, సత్తుపల్లి ఓసీపీ 3, శ్రావణపల్లి, కేకే- 6 బొగ్గు గనులు సంస్థకే చెందేలా చొరవ చూపాలని కోరారు. సత్తుపల్లి ఓసీపీ బ్లాక్‌‌‌‌ను ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులకు ఇస్తే కనీసం మట్టి పోసేందుకు కూడా స్థలం లేదని, ఇల్లందులోని కోయగూడెం బ్లాక్‌‌‌‌ షెడ్యూల్డ్‌‌‌‌ ఏరియాలో ఉన్నందున దానిని ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులకు కేటాయించడం చట్టవిరుద్ధం అన్నారు.

నాలుగు బొగ్గు బ్లాక్‌‌‌‌లను నామినేషన్‌‌‌‌ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలన్నారు. వీకే 7, ఆర్కేపీ ఓసీపీ, ఇల్లందు 21 ఇంక్లైన్‌‌‌‌కి పర్యావరణ పర్మిషన్లు రాకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోతుందని, వాటి పర్మిషన్లకు సహకరించాలని కోరారు. ఒడిశాలోని నైనీ బ్లాక్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ పర్యావరణ పర్మిషన్ల మంజూరు కృషి చేసిన మంత్రి కిషన్‌‌‌‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రిటైర్డ్‌‌‌‌ కార్మికుల పెన్షన్‌‌‌‌ రివిజన్‌‌‌‌, కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికుల హైపవర్‌‌‌‌ వేతనాల అమలుపై మంత్రితో చర్చించారు. కార్మిక సంఘాల డిమాండ్లపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, సింగరేణి విస్తరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు లీడర్లు తెలిపారు.

మంత్రిని కలిసిన వారిలో ఏఐటీయూసీ స్టేట్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్‌‌‌‌ సెక్రటరీ రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్​బి.జనక్​ప్రసాద్‌‌‌‌, సీనియర్‌‌‌‌ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ నరసింహారెడ్డి, బీఎంఎస్‌‌‌‌ నాయకులు పులి రాజిరెడ్డి, రమాకాంత్‌‌‌‌, పాల్గొన్నారు.

సింగరేణి జీఎం ఆఫీస్‌‌‌‌ ఎదుట రిలే దీక్షలు

బొగ్గు బ్లాక్‌‌‌‌ల వేలాన్ని నిరసిస్తు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్‌‌‌‌ బెల్లంపల్లి ఏరియాల సింగరేణి జీఎం ఆఫీస్‌‌‌‌ల ఎదుట దీక్షలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్, జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్‌‌‌‌ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోదావరి పరీవాహకంలోని బొగ్గు నిక్షేపాలను సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. గుజరాత్, ఒడిశా, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే తెలంగాణకు సైతం గనులు ఇవ్వాలని కోరారు.

బొగ్గు బ్లాక్‌‌‌‌ల వేలానికి గతంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీలు మద్దతు పలికారని, ఇప్పుడు ఆ పార్టీ లీడర్లు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు చొరవ చూపి సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్‌‌‌‌లను కేటాయించాలని, కొత్త గనులు వస్తేనే సింగరేణి మనుగడ, కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. ఈ నెల 13 వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్‌‌‌‌ అలీ

డిప్యూటీ జనరల్‌‌‌‌ సెక్రటరీలు కె.వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి బ్రాంచ్‌‌‌‌ సెక్రటరీలు బాజీ సైదా, సలేంద్ర సత్యనారాయణ, ఆంజనేయులు, దాగం మల్లేశ్‌‌‌‌, వైస్‌‌‌‌ ప్రెసిడెంట్లు కొట్టే కిషన్‌‌‌‌రావు, భీమనాథుని సుదర్శనం, ఇప్పకాయల లింగయ్య పాల్గొన్నారు.