
కొత్తగా.. వింతగా ఏది చేసినా రికార్డే. అది ప్రపంచంలో ఎక్కడా లేకపోతే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అలాంటి రికార్డే ‘ఫ్రెంచ్ ఫ్రైస్’కు దక్కింది. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ‘అదేంటి.. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పటి నుంచో ఉన్నవే కదా! అదెలా.. గిన్సిస్ బుక్‌లోకి ఎక్కిందా’ అనే కదా మీ డౌట్? న్యూయార్క్‌లోని ‘సెరెండిపిటి 3’ అనే రెస్టారెంట్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేశారు. ఈ మధ్య చాలామంది ఇష్టంగా తింటున్న ఫుడ్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయని గుర్తించాడు రెస్టారెంట్ ఓనర్. జూలై 13 ‘నేషనల్ ఫ్రెంచ్ ఫ్రైస్ డే’ సందర్భంగా వెరైటీగా బంగారు పూతతో ఫ్రెంచ్‌ఫ్రైస్ తయారు చేశాడు. దీని కోసం కేవలం 23 క్యారెట్ల బంగారాన్ని వాడాడు. మామూలుగా తయారు చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్‌పై గోల్డెన్ డస్ట్ చల్లాడు. రెస్టారెంట్లో డిస్ప్లే చేస్తే విజిటర్లు ముచ్చటగా చూశారు. ఈ విషయం గిన్నిస్ బుక్ వరకూ వెళ్లడంతో.. టెస్ట్ చేసి ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌గా వీటిని గుర్తించారు. వీటి విలువ 200 డాలర్లు.