మా పదేండ్ల శ్రమకు ఫలితం.. రాష్ట్రానికి ‘బీవైడీ’ రావడం సంతోషకరం: కేటీఆర్ ట్వీట్

మా పదేండ్ల శ్రమకు ఫలితం..  రాష్ట్రానికి ‘బీవైడీ’ రావడం సంతోషకరం: కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: తాము అధికారంలో ఉన్నప్పుడు పడ్డ శ్రమ రాష్ట్రానికి ఇప్పుడు ఫలితాల్ని ఇస్తోందని బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్​అన్నారు.  'రాష్ట్రంలో 10 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 2022–-23లోనే బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం తెలిపింది. 

కేంద్రం కారణంగా అప్పట్లో అది ఆగింది. ఆ పెట్టుబడులు ఎట్టకేలకు రాష్ట్రానికి వస్తుండటం సంతోషం. కేవలం మా ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైంది. ఏండ్ల తరబడి కష్టపడిన అందరికీ అభినందనలు’ అని ట్వీట్​చేశారు.