ఎన్నికల ఫలితాలపై సైబర్  నేరగాళ్ల కన్ను

ఎన్నికల ఫలితాలపై సైబర్  నేరగాళ్ల కన్ను
  • పీడీఎఫ్‌‌ లింక్స్ పంపి డబ్బులు దోచేందుకు యత్నం

హైదరాబాద్‌‌, వెలుగు : దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సైబర్  నేరగాళ్లు టార్గెట్ చేశారు. రిజల్ట్స్‌‌ పేరుతో ప్రజలకు నకిలీ లింక్స్‌‌  పంపి అందినకాడికి దోచేసుందుకు ప్లాన్  చేశారు. ఇందు కోసం పీడీఎఫ్‌‌లో  సైబర్ వల విసురుతున్నారు. ‘‘ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈ లింక్‌‌  ఓపెన్‌‌  చేయండి. పీడీఎఫ్‌‌లో మొత్తం వివరాలు ఉన్నాయి” అంటూ లింక్‌‌లు సర్క్యులేట్  చేస్తున్నారు.

పీడీఎఫ్‌‌  ఓపెన్ అయిన వెంటనే ఓటీపీ వచ్చేలా ప్లాన్  చేశారు. ఓటీపీ  ఎంటర్ చేయగానే అకౌంట్స్‌‌లోని డబ్బులు కొట్టేసేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి లింకులతో అప్రమత్తంగా ఉండాలని సైబర్  క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే మేసేజీలు, లింకులకు స్పందించవద్దని సూచిస్తున్నారు. అలాగే డిస్కౌంట్‌‌  ఆఫర్లు, డీల్స్‌‌ వంటి లింకులు వచ్చినా క్లిక్‌‌  చేయవద్దని హైదరాబాద్‌‌  సిటీ సైబర్‌‌ క్రైం  ఏసీపీ శివమారుతి పేర్కొన్నారు.