ముందంజలో ఆమ్ ఆద్మీ పార్టీ

పంజాబ్-హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. 14 వార్డుల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. 12 సీట్లతో బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉండగా... కాంగ్రెస్ 8 సీట్లు, శిరోమణి అకాలీదల్ 1 వార్డులో గెలిచింది. ప్రస్తుత మేయర్ రవి కాంత్ శర్మ ఓడిపోయారు. 45 మంది సభ్యులుండే చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లో... 35 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. 10 మంది నామినేటెడ్ సభ్యులుంటారు. చండీగఢ్ ఓటర్లకు థ్యాంక్స్ చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్. ఈ విజయం పంజాబ్ ఎన్నికల్లోనూ ఆప్ గెలవబోతోందనడానికి సిగ్నల్ అని ట్వీట్ చేశారు. ఇది ట్రైలరేనని... అసలు సినిమా పంజాబ్ లో ఉంటుందని ఆప్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే 12 సీట్లకే పరిమితమైనప్పటికీ... నామినేటెడ్ మెంబర్లతో బీజేపీ అధికారం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.