![హోరాహోరీగానే ఢిల్లీ ఫలితాలు.. ఆప్ ముందుకెళుతూ.. వెనక్కి పడుతూ..](https://static.v6velugu.com/uploads/2025/02/the-results-of-the-delhi-elections-are-exciting_FXZPEriznT.jpg)
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 2025, ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఉన్న రిజల్ట్స్ చూస్తే.. ఢిల్లీలో క్లియర్ మెజార్టీ ఎవరిది అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతూ ఉన్నాయి. ఆప్ కీలక నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సీఎం అతిశీ మొదట వెనకబడి ఉన్నా.. నాలుగు రౌండ్లు కంప్లీట్ అయ్యే సమయానికి ముందంజలోకి వచ్చారు. అయితే వాళ్ల ఆధిక్యం మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది.
Also Read :- ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్
>>> 10 గంటల 30 నిమిషాల సమయానికి ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం.. బీజేపీ 40 స్థానాల్లో.. ఆప్ 30 నియోజకవర్గాల్లో లీడింగ్‌లో ఉంది.
>>> కేజ్రీవాల్, అతిశీ, సిసోడియా స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. వారు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఇంకా 11 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది.
>>> మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలకు ఆప్ 6 సీట్లలో వెనకబడి ఉంటే.. బీజేపీ 6 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది.
>>> ఐదు రౌండ్ల కంప్లీట్ అయ్యే సమయానికి బీజేపీ 47 శాతం ఓట్లు.. ఆప్ 43 శాతం ఓట్లు రాబట్టుకున్నాయి.
>>> పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ వెనకబడి ఉంది. అయినా కూడా 7 శాతం ఓట్లు రాబట్టుకున్నది.