- దీప్తిశ్రీనగర్ - శాంతినగర్ రోడ్డుపై భారీ గుంత
- ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
మియాపూర్, వెలుగు: మియాపూర్ పరిధి మదీనాగూడలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగింది. దీప్తిశ్రీనగర్ నుంచి శాంతినగర్ వెళ్లే రోడ్డుపై టర్నింగ్వద్ద భారీ గుంత ఏర్పడింది. స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్అధికారులు వచ్చి పరిశీలించారు. రోడ్డును ఆనుకొని ఉన్న ఓపెన్ నాలా నుంచి డ్రైనేజీ నీరు పొంగడంతోనే కుంగిందని గుర్తించారు. దాదాపు 2 మీటర్ల లోతున రోడ్డుపై గుంత పడినట్లు తెలిపారు. పూడ్చే పనులు షురూ చేశారు. పనుల్లో క్వాలిటీ లేకపోవడంతోనే రోడ్డు కుంగిందని స్థానికులు మండిపడ్డారు.