గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్లు బాలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. దీనికి తోడు ట్రాఫిక్ తిప్పలు పెరిపోతున్నాయి. హైదరాబాద్ లోని ఓ ప్రధాన రద్దీ ఏరియాలో శుక్రవారం రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. మియాపూర్ దీప్తిశ్రీ నగర్‌లో డ్రైనేజీలోకి రోడ్డు కుంగిపోయింది. దీంతో నడి రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. అటుగా వెళ్లే ప్రయాణికులకు ఆ గుంత ఇబ్బందిగా మారింది.
స్థానికులు GHMC అధికారులకు సమాచారం ఇచ్చారు. కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ పైప్ లైన్ ఉండటంతో GHMC అధికారులు పరిశీలిస్తున్నారు. మరమ్మత్తులు చేయడానికి ఆర్ అండ్ బీ అధికారులు రంగంలోకి దిగారు.
మియాపూర్లో కుంగిన రోడ్డు#Hyderabad #Miyapur @Road pic.twitter.com/Q90JhjrBUu
— Govardhan Reddy Dasari (@SportsNewsInd24) September 13, 2024