
సిద్దిపేట రూరల్, వెలుగు: పండుగ కోసం ఊరికి వెళ్లితే దొంగలు ఇల్లును దోచేసిన సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణం హనుమాన్ నగర్ చెందిన బామన్ల బాలరాజ్ కొహెడ మండలం బస్వాపూర్ లో నిర్వహిస్తున్న బొడ్రాయి పండగలో పాల్గొనేందుకు బుధవారం చెల్లలు ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటి తాళం పగల గొట్టి ఉండటం గమనించిన చుట్టు పక్కల వారు బాలరాజ్ కు సమాచారం అందించారు.
ఇంటికి చేరుకున్న బాలరాజ్ ఇంటిలో పరిశీలించగా బీరువా తో పాటు, ఇంటిలోని వస్తువులు చెల్లచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించి, ఘటనలో 12 తులాల బంగారం, 25 తులాల వెండి, 2లక్షల వరకు నగదు చోరికి గురైనట్లు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు క్లుస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.