కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌక్ లో SBI ఏటీఎం మిషన్ ను ఎత్తుకెళ్లారు దొంగలు. అందులోని 30 లక్షల నగదు తీసుకొని ఏటీఎం మిషిన్ ను బైపాస్ రోడ్డు దగ్గర పడేసి వెళ్లారు. అర్ధరాత్రి  3 గంటల టైమ్ లో  తవేరా కారులో దొంగల ముఠా వచ్చినట్లు తెలుస్తోంది. దొంగలు ఎత్తుకెళ్లిన SBI ఏటీఎం… టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది. అంతకు ముందు దేవీచంద్ చౌక్ లోని వైష్ణవి జ్యువెలరీతో పాటు పక్కనే ఉన్న ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు దొంగలు. జ్యువెలరీలో అలారం మోగడంతో అక్కడి నుంచి పరారయ్యారు. దొంగల ముఠాలో మొత్తం ఐదుగురు సభ్యులున్నట్లు సమాచారం. సీసీ పుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

see more news

క్రిమినల్​ కేసు పెట్టినా రైతులకే మద్దతిస్త

ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే