- సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిదని సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల అన్నారు. ఆట పాట సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడలే చేసింది కళాకారులేనన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, కళాకారుల విభాగం ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. వెన్నెలతోపాటు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హాజరయ్యారు. వెన్నెల మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడుతుంది కళాకారులేనని, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు.