పార్టీ బలోపేతంలో బూత్ కమిటీల పాత్ర కీలకమైనదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో బీజేపీ నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ రాసిన ద రైస్ ఆఫ్ బీజేపీ పుస్తకంలోని బూత్ కమిటీల అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆ బుక్లో బూత్ కమిటీల గురించి 10 పేజీల్లో చక్కగా వివరించారని వివేక్ తెలిపారు. బీహార్లో 63వేల బూత్ కమిటీలున్నాయని.. ఒక్కో బూత్లో వంద ఓట్లు ఎక్కువ రావాలని వారు టార్గెట్ పెట్టుకుని పనిచేశారన్నారు. అయితే మన రాష్ట్రంలో 37 వేల కమిటీలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. యువత బీజేపీ వైపే ఉన్నారని.. ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.