ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, అచ్చంపేట, వెలుగు: అడవుల సంరక్షణలో అటవీ శాఖ ఆఫీసర్లు, సిబ్బంది పాత్ర మరువలేనిదని కలెక్టర్ ఎస్. వెంకటరావు కొనియాడారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద బొకే ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.  అనంతరం అటవీ శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు.  అంతకుముందు ఎస్పీ వెంకటేశ్వర్లు అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అలాగే అచ్చంపేట పట్టణంలోని ఫారెస్ట్ టింబర్ డిపో నుంచి ఫారెస్ట్​ ఫీల్డ్​డైరెక్టర్​శ్రీనివాస్​ ఆధ్వర్యంలో బైక్​ర్యాలీ నిర్వహించారు.  అనంతరం శ్రీనివాస్‌‌‌‌ మాట్లాడుతూ డ్యూటీలో భాగంగా స్మగ్లర్ల చేతుల్లో ఎంతో మంది సిబ్బంది  ప్రాణాలు కోల్పోయారని, అడవుల రక్షణ ద్వారానే  వారి ఆశయాలు నెరవేరుతాయని అన్నారు.  మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఏఎస్పీ రాములు , కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, డీఎఫ్‌‌‌‌వో సత్యనారాయణ, అచ్చంపేటలో ఎఫ్‌‌‌‌డీవో నవీన్​ రెడ్డి, రేంజ్​ఆఫీసర్స్​ ప్రభాకర్, రాజేందర్, ఫర్వేజ్, ఆదిత్య పాల్గొన్నారు. 


గురుకులాల్లో నాణ్యమైన విద్య :ఎంపీ పోతుగంటి రాములు 
కల్వకుర్తి, వెలుగు: ప్రభుత్వం సోషల్‌‌‌‌, ట్రైబల్‌‌‌‌, మహత్మా జ్యోతిబా పూలే గురుకులు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తోందని ఎంపీ పోతుగంటి రాములు చెప్పారు. ఆదివారం ఎమ్మెల్సీ కసిరెడ్డి  నారాయణ రెడ్డితో కలిసి కల్వకుర్తి పట్టణ పరిధిలోని జయప్రకాశ్ నగర్ గురుకులంలో నిర్వహించిన స్వచ్ఛ  గురుకుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. స్కూల్‌‌‌‌, హాస్టల్‌‌‌‌ పరిసరాలను నీట్‌‌‌‌గా ఉంచుకోవాలని సూచించారు.  అనంతరం మొక్క నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ప్రిన్సిపాల్‌‌‌‌ దానం పాల్గొన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో కవుల పాత్ర గొప్పది:వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కవుల పాత్ర ఎంతో గొప్పదని  వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్‌‌‌‌లో తెలంగాణ సారస్వత పరిషత్ రూపొందించిన ‘వనపర్తి జిల్లా సమగ్ర స్వరూపం,  జిల్లా వైభవం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం నాటి నుంచి తెలంగాణ ఉద్యమం వరకు సాహిత్యం పాత్ర కీలకమన్నారు.  కాలాన్ని ముందే పసిగట్టి హెచ్చరిక చేసే వారే కవులని, ఒక పుస్తకాన్ని ఒక వ్యాఖ్యలో చెప్పే ఘనత కవికి మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కవిత్వానికి ఉండే పదును, శక్తి దేనికీ ఉండదని, ఆయా ప్రాంతాల ప్రజల ఆలోచనలు, అలవాట్లను బట్టి సాహిత్యం ఉంటున్నారు.  ఎంపీ రాములు మాట్లాడుతూ సాహిత్యంలో వనపర్తి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నదని, సురవరం ప్రతాపరెడ్డి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం గర్వకారణమన్నారు. జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ కొత్తతరం వారికి చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం ఉందని సూచించారు.  సురవరం ప్రతాపరెడ్డి గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ 33 జిల్లాల చరిత్ర తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. వనపర్తి  అభివృద్ధి చెందుతున్న జిల్లాగా పేరుగాంచిందని, ప్రతి ఒక్కరూ జిల్లా చరిత్ర గురించి తెలుసుకోవాలని సూచించారు.  అంతకుముందు  కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం 40 మంది కవులను  మంత్రి  సన్మానించారు.  ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సారస్వత పరిషత్ చైర్మన్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ రామారావు,  అడిషనల్‌‌‌‌ కలెక్టర్ డి. వేణుగోపాల్, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,  కవులు, రచయితలు పాల్గొన్నారు.  

రెండు చోట్ల కూలిన ఇండ్లు
నవాబుపేట, అయిజ, వెలుగు:ముసురు వర్షాలకు రెండు చోట్ల ఇండ్లు కూలాయి. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్​గండ్లకు చెందిన బైండ్ల జంగమ్మ ఇంటిపైకప్పు నుంచి ఆదివారం తెల్లవారుజామున మట్టి కూలడంతో నలుగురు కుటుంబసభ్యులు బయటికి పరుగులు తీశారు.  కొద్ది సేపటికే  కప్పు మొత్తం కూలిపోయింది. అలాగే అయిజ మున్సిపాలిటీలోని 12 వ వార్డులో పాగుంట కృష్ణవేణి ఇంటిగోడ తెల్లవారు జామున కూలిపోయింది.  అంతకుముందే నిద్ర లేచిన కృష్ణవేణి, కూతురు ఇందిరమ్మ కాలకృత్యాల కోసం బయటికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈమె భర్త పాగుంట నారాయణ గతంలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న  కౌన్సిలర్ సువర్ణ మల్లికార్జున్ రెడ్డి బాధితులకు రూ. 5 వేలు సాయం చేశారు. 

చెక్‌‌‌‌డ్యామ్‌‌‌‌లో వ్యక్తి గల్లంతు
జడ్చర్ల టౌన్​, వెలుగు: చెక్ డ్యామ్‌‌‌‌లో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం..   జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామానికి చెందిన శివయ్య గౌడ్ (62) నెక్కొండ గ్రామంలో దుందుభి నదిపై నిర్మించిన చెక్ డ్యామ్‌‌‌‌లో మరో ఇద్దరితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో చెక్ డామ్‌‌‌‌ కింది వైపు వాగు దాటుతుండగా ప్రమాదవశత్తు గోతిలో మునిగి గల్లంతయ్యాడు. మిగతా ఇద్దరు వెతికేందుకు ప్రయత్నించినా ఉధృతి ఎక్కువగా ఉండడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.  గ్రామస్తుల చెప్పగా.. వాళ్లు  పోలీసులు,  ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఫైర్ టీం సభ్యులు  గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శివయ్య గౌడ్   ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ముఖ్య అనుచరుడు,  రైతుబంధు సమన్వయ సమితి కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. 

రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలి
అయిజ, వెలుగు: పోలీస్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని అభ్యర్థులు కోరారు.  ఆదివారం ఎమ్మెల్యే అబ్రహంను కలసి వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ పరీక్షల్లో ఓసీలకు మాత్రమే 20 మార్కులు తగ్గించి,  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.  సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే  పోలీస్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు చైర్మన్‌‌‌‌పై చర్యలు తీసుకోని.. వెనకబడిన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. 

పెబ్బేరులో ఐదు షాపుల్లో చోరీలు
పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు పట్టణంలో ఒకేరోజు ఐదు దుకాణాల్లో చోరీ జరిగింది. దుండగులు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు సీసీ కెమెరాలు పగలగొట్టి, గుణపాలతో షట్టర్లను పైకి ఎత్తి  క్యాష్​ కౌంటర్లలో ఉన్న పైసలను ఎత్తుకెళ్లారు.  బాధితుల వివరాల ప్రకారం.. పెబ్బేరులోని  పీజేపీ క్యాంపు ఎదురుగా ఎన్​హెచ్​ 44పైనున్న బాలాజీ ఎంటర్​ప్రైజెస్​ షాప్లో రూ.6 వేలు, బునియాదిపురం వెళ్లే రోడ్డులో ఉన్న లక్ష్మిదుర్గ హార్వెస్టర్​ షోరూమ్‌‌‌‌లో రూ.50 వేలు దొంగిలించారు.  ప్రధాన రహదారిపై ఉన్న రీబటన్​ షాప్​, హెచ్‌‌‌‌పీ పెట్రోల్​ బంకు వెనకాల ఉన్న హార్వెస్టర్​ షో రూమ్‌‌‌‌, అక్కడే ఉన్న చిన్న కిరాణ కొట్టు షట్టర్లను తెరిచినా.. అక్కడ డబ్బులు లేకపోవడంతో వెళ్లిపోయారు. ఉదయం బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాలను పరిశీలించారు.  ఈ విషయమై ఎస్సై రామస్వామిని వివరణ కోరగా.. చోరీలు జరిగిందని నిజమేనని,  దొంగలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యారని చెప్పారు.  బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

బాధితులకు రక్షణ కల్పించాలి:రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశం
గద్వాల, వెలుగు: అగ్రవర్ణాల చేతిలో దాడికి గురైన బాధితులకు రక్షణ కల్పించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. ఆదివారం గద్వాల మండలం అనంతపురం గ్రామంలో బాధితులను ఆయన పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనులో పందులు మేస్తున్నాయని ఎరుకుల కులస్తులను చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమన్నారు.  వాళ్లు ఇప్పటికీ భయాందోళనలో ఉన్నారని వాపోయారు. ఆఫీసర్లు బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  నేతలు విజయ్, కృష్ణయ్య, కృష్ణ మౌర్య, వెంకటన్న, భద్రప్ప  పాల్గొన్నారు.