రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది

రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది

నిజామాబాద్​, వెలుగు :  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన కీలక పాత్రను పాలకులు గుర్తించాలని టీయూడబ్ల్యుజే యూనియన్​ జిల్లా ప్రెసిడెంట్​ఎడ్ల సంజీవ్​ కోరారు. ఆదివారం వినాయక్​నగర్​లోని అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  యాజమాన్యాలు ఉద్యోగాలు తొలగిస్తాయని తెలిసి కూడా జర్నలిస్ట్​లు మలిదశ ఉద్యమంలో గొప్ప రోల్​ పోషించారన్నారు.  

పాలక నేతలు తమను గుర్తించడం లేదని వాపోయారు.  గతంలో జరిగిన లోపాలను కాంగ్రెస్​ గవర్నమెంట్​సరి చేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.  స్టేట్​ కౌన్సిల్​ మెంబర్​ బొబ్బిలి నర్సయ్య, జిల్లా జనరల్​ సెక్రెటరీ అరవింద్ బాలాజీ, ట్రెజరర్ సిరిగాధ ప్రసాద్,  సంజీవ్​రెడ్డి అక్రిడేషన్​ కమిటీ సభ్యుడు పాకాల నర్సింలు, ఎలక్ట్రానిక్​ మీడియా ప్రతినిధులు రాజేశ్​, ధనుంజయ్​, ప్రెస్​ క్లబ్​ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ,  భైరా శేఖర్​, గోవిందరాజు తదితరులు ఉన్నారు