కౌన్ బనేగా కరోడ్‌పతి 16 వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ షో లో క్రికెట్ పై ఒక ప్రశ్న కంటెస్టెంట్ కు ఎదురైంది. క్రికెట్ ప్రేమికులు ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీగా చెప్పేస్తారు. తొలి 9 ప్రశ్నలకు ఈజీగా సమాధానం చెప్పి కంటెస్టెంట్ లక్ష 60 వేల రూపాయలను గెలుచుకున్నాడు. రూ.3 లక్షల 20 వేల రూపాయలకు కంటెస్టెంట్ కు క్రికెట్ రూపంలో ప్రశ్న ఎదురైంది.
ఒకే క్యాలండర్ అత్యధిక సిక్సర్లు కొట్టిన న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్కలం రికార్డ్ ను ఎవరు బద్దలు కొట్టారు అనే ప్రశ్న అడిగారు. యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషాన్, సర్ఫరాజ్ ఖాన్, శుభమాన్ గిల్ అనే నాలుగు ఆప్షన్స్ కంటెస్టెంట్ కు ఇవ్వబడ్డాయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ.. యశస్వి జైశ్వాల్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు.
ALSO READ | National Sports Awards: ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న గుకేష్, మను భాకర్
రెండో రోజు(నవంబర్ 23, 2024)లో ఆటలో జైస్వాల్ 193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 90 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ రెండు 2 సిక్సర్లతో ఈ భారత ఓపెనర్.. న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2014లో కివీస్ గ్రేట్ మెకల్లమ్ 33 సిక్సర్లు కొట్టగా.. జైస్వాల్ ఈ ఏడాది 34 సిక్సర్లు బాదాడు. ఈ భారత యువ ఓపెనర్ ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2008లో సెహ్వాగ్ 22 సిక్సర్లు కొట్టగా.. జైస్వాల్ దానిని ఎప్పుడో అధిగమించాడు.
టెస్ట్ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు
1. యశస్వి జైస్వాల్: 34 సిక్సర్లు(2024)
2. బ్రెండన్ మెకల్లమ్: 33 సిక్సర్లు(2014)
3. బెన్ స్టోక్స్: 26 సిక్సర్లు (2022)
4. ఆడమ్ గిల్‌క్రిస్ట్: 22 సిక్సర్లు (2005)
5. వీరేంద్ర సెహ్వాగ్: 22 సిక్సర్లు (2008)