ఉప్పల్ టు యాదాద్రి.. 104 మినీ బస్సులు

హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మూలవిరాట్‌ దర్శనాలు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం ‘యాదాద్రి దర్శిని’ పేరుతో మినీ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు వచ్చే భక్తుల దర్శనార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి వందకు పైగా మినీ బస్సులను అందుబాటులో ఉంచింది. ఇవాళ  ఈ నూతన బస్సు సర్వీసులను ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ వీసీ సజ్జనార్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. 

ఈ బస్సు సర్వీసుపై సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్‌కు, అక్కడి నుంచి యాదగిరి గుట్టకు మినీ బస్సులను నడుపుతామన్నారు. జేబీఎస్‌ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్‌ నుంచి రూ.75గా టికెట్‌ ధరను నిర్ణయించామని వెల్లడించారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాఫీగా సాగుతుందన్నారు. వీఆర్‌ఎస్‌కు రెండు వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. అయితే వీఆర్‌ఎస్‌ కోసం ఉద్యోగులను తాము బలవంతం చేయట్లేదన్నారు. ఎంప్లాయీస్ వీఆర్‌ఎస్‌ సంఖ్యను బట్టి ప్యాకేజీ సిద్ధం చేస్తామన్నారు. వీఆర్‌ఎస్‌ తేలిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం:

సీఆర్పీఎఫ్ బంకర్‌‌పై బాంబు వేసిన మహిళ

మైక్ టైసన్ దెబ్బలకు కాన్ఫిడెన్స్ పెరిగింది 

లాభాల్లో స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న సూచీలు