అడ్లూరు ఎల్లారెడ్డిలో కామారెడ్డి రైతుల సమావేశం

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వివరణ ఇచ్చినా రైతులు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అడ్లూర్ ఎల్లారెడ్డిలో సమావేశం ఏర్పాటు చేశారు.

భవిష్యత్ కార్యాచరణపై రైతులు చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎనిమిది గ్రామాల రైతులు హాజరయ్యారు. రైతుల భవిష్యత్తు కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. రైతుల నిర్ణయం ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.