
ఈ మధ్య జాబ్ మేళాలు చూసుంటారు. పోస్టులు ఎన్ని ఉన్నాయని కాదు.. వేల సంఖ్యలో.. అవసరం అనుకుంటే లక్షల్లో నిరుద్యోగులు హాజరవుతున్న పరిస్థితి.. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా.. ఇదే పరిస్థితి. ఎక్కడ జాబ్ మేళా ఉన్నా.. ఏ కంపెనీ ఇంటర్వ్యూకు పిలిచినా నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. ఈ సిచువేషన్ చూస్తేనే అర్థం అవుతుంది.. అన్ఎంప్లాయిమెంట్ రేటు ఎలా పెరిగింది అనేది. వంద మంది పాస్ అవుట్ అవుతుంటే 3 నుంచి 5 మందికే జాబ్స్ దొరుకుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం జాబ్స్ కోసం ఎగబడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రముఖ ఇన్వెస్టర్, మెర్సిలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఫౌండర్, సౌరభ్ ముఖర్జియా ఉద్యోగాలపై బాంబ్ పేల్చారు. ఆయన మాటలు మిడిల్ క్లాస్ ఊహలన్నీ పేకమేడల్లా కూలిపోయినట్లు.. ఫ్యూచర్ ఒక్కసారిగా కళ్లముందు కనిపించడం ఖాయం. అదేంటో తెలుసుకుందాం.
రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ మిడిల్ క్లాస్ ప్రజలు ఎంత డేంజర్ లో ఉన్నారో చెప్పారు సౌరభ్ ముఖర్జియా. ‘‘జీతాల శకం ముగిసింది (The age of the salaryman is over.). ఇండియన్ మిడిల్ క్లాస్ తొందరగా మారకపోతే అంతే సంగతులు’’ అని బాంబ్ పేల్చారు. ఇండియా న్యూ ఎకనమిక్ ఫేజ్ (నూతన ఆర్థిక దశ) లోకి ఎంటర్ అవుతోంది. సంప్రదాయ ఉద్యోగాలు, వైట్ కాలర్ జాబ్స్, జీతంపై ఆధారపడి చేసే జాబ్ లపై ఎంత మాత్రం చదువుకున్న వాళ్లు ఆధారపడే పరిస్థితి లేదు’’ అని అన్నారు.
ఈ దశాబ్దంలో జాబ్స్ క్రమక్రమంగా తగ్గుతాయని సౌరభ్ అన్నారు. ఏఐ (Artificial Intelligence) ఆధారిత ఆటోమేషన్, వివిధ పరిశ్రమలలో మెషిన్లను మనుషులు నడిపే వ్యవస్థ పడిపోతుండటమే అందుకు కారణం అని అభిప్రాయపడ్డారు.
‘‘తమ కంపెనీ కోడింగ్ లో మూడవ వంతు ఏఐ రాసేస్తోందని గూగుల్ ప్రకటించింది. అదే పరిస్థితి ఇండియన్ ఐటీ, మీడియా, ఫైనాన్స్ కంపెనీల్లో ఉంటుంది. చివరికి సూపర్ వైజర్ పోస్టులు కూడా ఏఐ కారణంగా కనుమరుగు అవుతాయి’’ అని ఆయన తెలిపారు. మన తండ్రులు, తాతలు చేసినట్లుగా 30 ఏళ్లుగా ఒకే కంపెనీలో జాబ్ చేశానని చెప్పుకునే పరిస్థితులు భవిష్యత్తులో ఉండవని.. మిడల్ క్లాస్ దశాబ్దాలుగా ఆధారపడిన జాబ్ వ్యవస్థ కుప్పకూలుతుందని సౌరభ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మిడిల్ క్లాస్ కు ఉన్న ఏకైక మార్గం.. ఆంత్రప్రెన్యూవర్షిప్ కు షిఫ్ట్ కావడమేనని అన్నారు. జన్ ధన్, ఆధార్, మొబైల్ అనే త్రయం ద్వారా అవకాశాలను వెతవకొచ్చునని చెప్పారు. వీటిద్వారా ఐడెంటిటీ, బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్.. ఈ మూడింటి ఆధారంగా ఆంత్రప్రెన్యూవర్షిప్ వైపు తరలేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు.
ఇండియా జీతాలపై ఆధారపడి, జీతాల ఆధారంగా వ్యక్తుల కేపబులిటీని లెక్కగట్టే సొసైటీ అని. .కానీ ఇకనుంచి ఆ దృక్పథం నుంచి మనల్ని మనం మార్చుకవాలని అన్నారు. నెలవారీగా వచ్చే ఆదాయం కాకుండా.. హ్యాపీనెస్, మనం చేస్తున్న పని ప్రభావం అనే అశం ఆధారంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని సూచించారు. పిల్లలను జాబ్స్ కోసం తయారు చేసే కుటుంబాలు మారాలనీ.. ఫ్యూచర్ లో జాబ్స్ అంటూ ఉండవనీ ఈ సందర్భంగా చెప్పారు.