
అసూస్ ఇటీవల లాంచ్ చేసిన రోగ్ 7 సిరీస్ ఫోన్ అమ్మకాలు మొదల య్యాయి. రోగ్ ఫోన్ 7, రోగ్ ఫోన్ 7 అల్టిమేట్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇవి 65వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తాయి. రోగ్ 7 ధర రూ.74,999 కాగా, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ఉంటాయి. ఇది ఫాంటమ్ బ్లాక్, స్టార్మ్ వైట్ రంగులలో లభిస్తుంది. రోగ్ ఫోన్ 7 అల్టిమేట్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ధర రూ.లక్ష. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌ను అమర్చారు. రెండు ఫోన్లలో 6.78-అంగుళాల స్క్రీన్ ఉంటుంది.