
పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే సీరీసన్ ను సునాయాసంగా క్లీన్ స్వీప్ చేసింది ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న కివీస్.. శనివారం (ఏప్రిల్ జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్ లోనూ పాక్ ను చిత్తు చేసింది. దీంతో సీరీస్ 3-0 తో న్యూజిలాండ్ సొంతం అయ్యింది.
మూడవ వన్డేలో వర్షం కారణంగా మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. ఓపెనర్ రయిస్ మర్యూ, కెప్టెన్ మిచెల్ బ్రేస్ వెల్ ల హఫ్ సెంచరీలతో 42 ఓవర్లలో 264/8 చేసింది. అయితే వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన పాక్.. ఈ మ్యాచ్ గెలిచి గౌరవం దక్కించుకోవాలని ప్రయత్నించినా చెత్త ప్రదర్శనతో అది నిరాశగానే మిగిలింది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడినా పాక బ్యాటింగ్ తీరులో మార్పు రాలేదు.
Also Read :- తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్పై సూర్య కుమార్ రియాక్షన్ చూశారా
ఛేజింగ్ లో బాబర్ అజామ్ 4 ఫోర్లు, 1 సిక్సర్ తో అర్థ సెంచరీ చేయగా.. రిజ్వాన్ (37), అబ్దుల్లా షఫిక్ 33, తాహిర్ 33 రన్స్ చేశారు. 40 ఓవర్లకు కేవలం 221 రన్స్ చేయగలిగారు. బెన్ సీయర్ 5 వికెట్లు తీసి పాక్ పతనానికి కారణం అయ్యాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ బ్యాటర్లలో రయిస్ మర్యూ (58), కెప్టెన్ మిచెల్ బ్రేస్ వెల్ (59), డెరైల్ మిచెల్ (43) సహాయంతో టీమ్ మొత్తం 264/8 స్కోర్ చేయగలిగింది. దీంతో సీరీస్ ను 3--0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.