పోలవరం ప్యాకేజీ ప్రకటించాలె

బూర్గంపహాడ్, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు ఆదివారం గోదావరిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. మోకాలు లోతు నీళ్లలో నిలబడి ప్రభుత్వాలు తమ గోడు వినాలని నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ప్యాకేజీ ప్రకటించాలని, అదేవిధంగా సురక్షితమైన, మైదాన ప్రాంతాల్లో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటివరకు కిన్నెరసాని, గోదావరి నది పరివాహక ప్రాంతాల వరదలతో బూర్గంపహాడ్ ముంపునకు గురయ్యేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామానికి ముంపు ముప్పు మరింత పెరిగిందన్నారు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా  కాంతారావు తమ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.