అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో రోజూ రద్దు

గ్రేటర్ నోయిడా : అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో రోజు ఆట కూడా రద్దయింది. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి షాహీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయ్ సింగ్ పాఠిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలోని  ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్ చిత్తడిగా మారింది. ముందుగానే ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టార్పాలిన్ కవర్లు కప్పినా, సూపర్ సాపర్లతో నీళ్లు తోడి, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాన్లతో పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆరబెట్టే ప్రయత్నం చేసినా రెండో రోజూ ఒక్క బంతి కూడా పడలేదు.  

మంగళవారం ఒక్క చుక్క వర్షం లేకపోయినా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేయలేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.   దాంతో ఈ స్టేడియానికి ఇకపై ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కేటాయించే అవకాశాలు సన్నగిల్లాయి.