హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) రెండో గెజిట్ విడుదలైంది. మరో 6 గెజిట్ లను దశల వారీగా విడుదల చేయనున్నట్లు నేషనల్హైవే అధికారులు చెబుతున్నారు. తాజా గెజిట్ కు సంబంధించి ఓ తెలుగు, ఓ ఇంగ్లీష్ పేపర్ ద్వారా పత్రికా ప్రకటన విడుదల చేశారు. భూసేకరణలో అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు గెజిట్ విడుదల అయిన తేదీ నుంచి అమల్లో వస్తుంది. భూసేకరణ కోసం ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 8 ఆర్డీవోల పరిధిలో 8 యూనిట్లను ఖరారు చేస్తూ కేంద్రం ఇటీవల తొలి గెజిట్ ను విడుదల చేసింది. ల్యాండ్ పోతున్న సర్వే నంబర్లు, ల్యాండ్ విస్తీర్ణం, సేకరించే భూమి విస్తీర్ణం వివరాలు గెజిట్ లో పేర్కొన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని(ఆందోల్ జోగిపేటసెక్షన్) శివంపేట, కోర్పోల్, వెండికోలే, వెంకటక్రిష్టాపూర్, లింగంపల్లి గ్రామాల వివరాలను వెల్లడించింది. భూయజమానులు తమ అభ్యంతరాలను భూ సేకరణ అధికారికి ఇవ్వాలని పేర్కొంది. వీరి అభ్యంతరాలను పరిశీలించి వారికి ఆన్సర్లు ఇచ్చిన తరువాత ఆ ప్రాంతాల్లో రోడ్డుకు మార్కింగ్ చేయనున్నారు. భూసేకరణ పనులు మొదలు పెట్టడానికి మరో గెజిట్, పరిహారానికి మరో గెజిట్ ను విడుదల చేయనున్నారు. యాదాద్రి అడిషనల్ కలెక్టర్ భూసేకరణ యూనిట్ లో 208.6090 హెక్టార్ల భూమి, ఆందోల్ ఆర్డీవో పరిధిలో108.9491 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టుకు సేకరించనున్నట్లు గెజిట్ లో వెల్లడించింది.
భూసేకరణలో అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు
- హైదరాబాద్
- April 23, 2022
లేటెస్ట్
- అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలు నిలిపివేత
- మనోళ్లు బాగానే దాచేస్తున్నారు.. పొదుపులో అమెరికాను దాటేశాం.. టార్గెట్ ఆ మూడు దేశాలే
- కౌశిక్ హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన అభిమాని...తారక్ కాంట్రవర్సీ కి చెక్..
- PM Kisan:19వ విడత పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే..
- Christmas 2024 : క్రిస్మస్ కేక్స్.. బిర్యానీ స్పెషల్స్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ రెసిపీలు ఇవే.. ట్రై చేయండి.. ఎంజాయ్ చేయండి..!
- Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్లో టోర్నీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విడుదల
- పని మనుషులుగా చేరి..45 లక్షల డైమండ్ నెక్లెస్ చోరీ..ఉదయాన్నే నిద్రలేచే సరికి పరార్
- ప్రభుత్వ ఇన్సురెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు.. అర్హతలు ఇవే
- శ్రీతేజ్ కోలుకుంటున్నాడు.. కేసు వాపస్ తీసుకుంటా: రేవతి భర్త భాస్కర్
- 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు టార్గెట్.. ఫస్ట్ వాళ్లకే ఇస్తాం : పొంగులేటి
Most Read News
- ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటీ..: విచారణలో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి
- నాకు తెలియదు.. గుర్తు లేదు..: బౌన్సర్లపై ప్రశ్నలకు.. బన్నీ సమాధానం ఇదే
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
- Game Changer: గేమ్ ఛేంజర్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!
- ఎలా వచ్చారు..? ఎలా వెళ్లారు..? ఓ సారి చేసి చూపించండి.. సంధ్య థియేటర్ దగ్గర బన్నీతో సీన్ రీకన్స్ట్రక్షన్
- ‘ఓరియంట్’ కార్మికుల భవిష్యత్ ఏంటి ?..ఫ్యాక్టరీలో 2,358 పర్మినెంట్, కాంట్రాక్ట్ వర్కర్స్
- AP News: కలెక్టర్ల సదస్సులో రెండు రోజుల భోజనం ఖర్చు రూ. 1.2 కోట్లా..
- మన జీవితాలు ఎప్పుడూ ఏడుపే.. మన కంటే పాకిస్తాన్ వాళ్లే హ్యాపీ అంట..!
- ఎంతకు తెగించార్రా..! షమీ - సానియా మీర్జాకు పెళ్లి చేసేశారు
- ‘నో డిటెన్షన్ పాలసీ’ రద్దు.. 5, 8 క్లాసుల్లో ఫెయిలైతే మళ్లీ చదవాల్సిందే