స్విస్​ అకౌంట్ల రెండో లిస్ట్​: మనోళ్ల ఖాతాల వివరాలివే..!

స్విస్​ అకౌంట్ల రెండో లిస్ట్​: మనోళ్ల ఖాతాల వివరాలివే..!

మనోళ్ల ఖాతాల వివరాలిచ్చిన స్విట్జర్లాండ్

న్యూఢిల్లీ: తమ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్న మనోళ్ల వివరాలను స్విట్జర్లాండ్​ పంపించింది. ఆటోమేటిక్​ ఎక్స్చేంజ్​ ఆఫ్  ఇన్ఫర్మేషన్​(ఏఈఓఐ) ఒప్పందంలో భాగంగా స్విస్ సర్కారు ఈ లిస్ట్​ను అందించింది. విదేశాల్లో దాచిన బ్లాక్​మనీపై పోరాటంలో భాగంగా కేంద్రం చేపట్టిన చర్యల ఫలితంగానే ఈ వివరాలను అందుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకోసం స్విట్జర్లాండ్​ ప్రభుత్వంతో ఇన్ఫర్మేషన్​ ఎక్చేంజ్​ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 86 దేశాలతో స్విట్జర్లాండ్​ ఈ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా స్విస్​ బ్యాంకుల్లో అకౌంట్లు మెయింటెయిన్​ చేస్తున్న మనోళ్ల వివరాలతో గతేడాది ఫస్ట్​ లిస్ట్​ అందించింది. 2018 వరకు యాక్టివ్​గా ఉన్న, క్లోజ్​ చేసిన ఖాతాల వివరాలను ఈ లిస్ట్​లో పంపించింది. అంతకుముందు కూడా ఇండియా రిక్వెస్ట్​ మేరకు వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వంద మంది ఖాతాల వివరాలను అందజేసినట్లు స్విస్​ అధికారులు తెలిపారు. ఇక, ఈ ఏడాది మొత్తం 75 దేశాలకు చెందిన 31 లక్షల వ్యక్తులు, సంస్థల ఖాతాల వివరాలను ఆయా దేశాలకు వెల్లడిస్తామని ఫెడరల్​ ట్యాక్స్​ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్​టీఏ) శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.