బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ రెండో దశ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని ఒడిశాలోని చాందీపూర్‌లో చేపట్టగా క్షిపణి రక్షణ వ్యవస్థ పూర్తి సామర్థ్యాలు ప్రదర్శించింది. 5 వేల కిలోమీటర్ల పరిధి కలిగిన శత్రుదేశ క్షిపణులను ఇది ఎదుర్కోగలదు. టార్గెట్ మిస్సైల్‌ను ఎల్సీ–IV ధమ్రా నుంచి బాలిస్టిక్ మిస్సైల్లా ప్రయోగించారు. దీన్ని భూమి, సముద్రం మీద మోహరించిన వెపన్ సిస్టమ్ రాడార్ కనుగొన్నది. ఆ తర్వాత ఏడీ ఇంటర్ సెప్టర్ను యాక్టివేట్ చేసింది. ఫేజ్–2 ఏడీ ఎండో అట్మాస్పియరిక్ మిస్సైల్‌ను చాందీపూర్ నుంచి ప్రయోగించారు.
ఫ్లైట్ టెస్ట్‌లో లాంగ్ రేంజ్ సెన్సర్స్లో లెటన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్, ఎంసీసీ, అడ్వాన్స్డ్ ఇంటర్ సెప్టార్ తో కూడిన నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ఆయుధ వ్యవస్థ అనుకున్న విధంగా అన్ని లక్ష్యాలను చేరుకున్నది. ఆన్‌బోర్డ్ షిప్‌తోపాటు వివిధ ప్రదేశాల్లో మోహరించిన రేంజ్ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా విమాన డేటాను సేకరించి క్షిపణి పనితీరును అంచనా వేసింది.
ఫేజ్–II ఏడీ ఎండో అట్మాస్పియరిక్ క్షిపణి దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు దశల సాలిడ్ ప్రాపెల్డ్ గ్రౌండ్ లాంచ్డ్ క్షిపణి వ్యవస్థ. ఈ వ్యవస్థ శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను లో ఎక్సో అట్మాస్ఫియర్ పరిధిలో తటస్థీకరిస్తుంది.
డీఆర్డీవో ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన అనేక స్వదేశీ సాంకేతికతను ఈ వ్యవస్థలో పొందుపరిచారు.