రాష్ట్రానికి 27 వేల టన్నుల యూరియా
వ్యవసాయ శాఖ సెక్రెటరీ ఎం.రఘునందన్ రావు
గోదావరిఖని, వెలుగు : ఆర్‌ఎఫ్‌సీఎల్(రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్లిమిటెడ్) ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన యూరియాలో తెలంగాణ జిల్లాలకు 27 వేల టన్నులు సప్లై చేయాలని వ్యవసాయ శాఖ సెక్రెటరీ ఎం.రఘునందన్ రావు ఆదేశించారు. సోమవారం ఫెర్టిలైజర్స్ జేడీఏ రాములుతో కలిసి ఆయన ప్లాంట్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ జూన్ లో 15 రోజులు యూరియా ఉత్పత్తి చేయలేదన్నారు. తొలకరి వానలతో జులై, ఆగస్టు నెలల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుందని, దాని ప్రకారం సప్లై చేయాలన్నారు. అనంతరం చిన్నకల్వల రైతు వేదికలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఏడీఏలతో సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ పథకాలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఆఫీసర్లు దోమ ఆదిరెడ్డి, శ్రీనాథ్, కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.