న్యూఢిల్లీ: పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రా కోటా చెల్లదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీట్ల భర్తీకి గతంలో ఉన్న 50 శాతం కోటా చెల్లదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర కోటా మెడికల్ సీట్లను కూడా నీట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించింది. మెడికల్ సీట్ల భర్తీలో రాష్ట్రా కోటాను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఈ పిటిషన్లపై 2025, జనవరి 29న జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పీజీ వైద్య కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగం విరుద్ధమని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే నివాస ఆధారిత రిజర్వేషన్ల ద్వారా సీట్ల పొందిన అభ్యర్థులకు ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది.
In a Major blow to PG Medical aspirants of Karnataka, Maharashtra, TamilNadu , Delhi & Telangana ( States with maximum PG Seats) , Supreme Court has struck down the 50% of seats reserved for Local Residents..From Just 15% before NEET , now 100% seats are made available to… pic.twitter.com/cTAxADap9Z
— Mahesh.BR (@Maheshbr4U) January 29, 2025