సింగరేణి ఆఫీసర్​కు అరుదైన అవకాశం

  •     ఐఐఐఈ చైర్మన్​గా ప్రభాకర్​రావు ఎన్నిక

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​లో ఎస్వోటు సీటీసీగా పనిచేస్తున్న  సూపరిటెండెంట్ ​ఆఫ్​ ఇంజనీర్(ఐఈడీ) మొట ప్రభాకర్​రావు ప్రతిష్ఠాత్మక ఇండియన్​ ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్​ ఇండస్ట్రియల్​ ఇంజినీరింగ్ (హైదరాబాద్​ చాఫ్టర్) కౌన్సిల్ చైర్మన్​గా ఎన్నికయ్యారు. 

ఆదివారం సింగరేణి భవన్​లో ఐఐఐఈ కౌన్సిల్​ మీటింగ్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-27 కాలపరిమితికి 12 మందితో కూడిన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభాకర్​రావును చైర్మన్​గా, ఇద్దరు వైస్ ​చైర్మన్లు, గౌవర​సెక్రటరీ, ఇద్దరు జాయింట్​ సెక్రటరీలు, గౌరవ ట్రేజరర్​తో పాటు నలుగురు సభ్యులను ఎన్నుకున్నారు. ఎస్వోటు సీటీసీగా సేవలందిస్తున్న ప్రభాకర్​ రావు సింగరేణి ఎస్టీపీపీలో 2012 నుంచి పనిచేస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల ఎస్టీపీపీ సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.