గయాన్(అఫ్గానిస్తాన్) : సౌత్ఈస్ట్ అఫ్గానిస్తాన్‌లో భూకంపం వచ్చిన వారం రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి మారలేదు. కూలిన మట్టి ఇండ్లు, మొండి గోడలు, దుమ్ము తప్ప ఏం కనిపించడం లేదు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కొందరి మృతదేహాలు శిథిలాల కిందే ఉండిపోయాయి. ఇప్పటి వరకు 1,150 మంది చనిపోగా.. వేలాది మంది గాయపడ్డారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సాయం చేసేందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొండ చరియలు విరిగిపడటంతో రోడ్లు దెబ్బతిన్నాయి. తమ వాళ్ల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు శిథిలాలను తొలగిస్తూనే ఉన్నారు. కట్టుబట్టలతో మిగిలిపోయామని, మళ్లీ జీవితం ఎలా ప్రారంభించాలో తెలియడం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. గాయపడిన వారికి సరైన చికిత్స కూడా అందని పరిస్థితి నెలకొంది. ఇండ్లు మళ్లీ కట్టుకుందామంటే చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి. పక్టికా, ఖోస్ట్ ప్రావిన్స్‌లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, బాధితులను ఆదుకోవాలంటూ తాలిబన్ ప్రభుత్వం అమెరికాను కోరింది. ఫ్రీజ్ చేసిన మనీని రిలీజ్ చేయాలని కోరింది. 800 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, మానవతా దృక్పథంతో ఆదుకోవాలని తాలిబన్లు ప్రపంచ దేశాలను కోరుతున్నారు. కొన్ని దేశాల నుంచి టెంట్లు, టవెల్స్, బెడ్లతో పాటు నిత్యావసరాలు అందాయి. యూఎన్ హెలీకాప్టర్లు అక్కడ ల్యాండై.. బ్రెడ్, బియ్యం, బ్లాంకెట్లు, ఆహార ప్యాకెట్లతో పాటు మెడిసిన్స్ అందజేశాయి.ఇరాన్, పాకిస్తాన్, సౌత్ కొరియా, యూఏఈ, ఖతర్‌తో పాటు ఇండియా సాయం చేసింది.
సాయం కోసం వేలాది మంది ఎదురుచూపులు
- విదేశం
- June 27, 2022
లేటెస్ట్
- న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో భారీ సైబర్ దోపిడీకి ప్లాన్.. క్లిక్ చేస్తే పైసలు మాయం
- భూపాలపల్లి వెళితే తప్పక చూడాల్సిన టూరిజం పాయింట్.. ఆకట్టుకునే ముత్యపు ధార వాటర్ ఫాల్స్..
- వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!
- Good News: తెలంగాణ నేతల లేఖలకు టీటీడీ అనుమతి
- ఇంకా ఉంది: 2 కీలక కేసుల్లో విచారణ వాయిదా
- నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కలకలం.!
- 2025 నూతన సంవత్సరం కోసం.. విషెష్ కోట్స్, ఫన్నీ విషెష్
- మాదాపూర్‌లో డివైడర్ ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి
- కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ పోటీ డౌటే!..
- ఏపీలో కొత్త ఏడాది జోష్.. ఈ బ్రాండ్లను ఎగబడి కొంటున్న మద్యం ప్రియులు
Most Read News
- తెలంగాణలో కొత్తగా 13 వేల కొలువులు..ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురూ
- సంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
- కామారెడ్డిలో ఆ ముగ్గురి ఆత్మహత్యకు కారణమేంటి?
- పక్కా ఇండ్లు ఉన్నా.. ఇందిరమ్మకు అప్లికేషన్
- గేమ్ ఛేంజర్ రివ్యూ వైరల్.. సెకెండాఫ్ సూపర్ అంట..
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్‌ఫ్రెండ్‌కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- Jobs Alert: SBI బ్యాంకులో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- టాటా చైర్మన్ చంద్రశేఖరన్ శుభవార్త చెప్పారు.. ఇదే జరిగితే ఎంత బాగుంటుందో..
- మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు: KCR
- హైదరాబాద్‌లో మటన్ షాపుకు పోతున్నరా? ఈ స్టాంప్ ఉన్న మాంసం తింటేనే సేఫ్.. చూసి కొనండి..