ఇల్లు అందంగా కనిపించేందుకు వాల్పేపర్లు అంటిస్తాం. కానీ, ఆ వాల్పేపరే ఫోన్లకు, కంప్యూటర్లకు నెట్‌ను అందించే వైఫైగా మారిపోతే ఎలా ఉంటుంది? ఆ వాల్పేపరే ఇంట్లో పొల్యూషన్‌ను గుర్తిస్తే.. ఇంకా సూపర్ కదా. దానికి పవరే అవసరం లేకుంటే.. మరింత సూపర్ కదా! అలాంటి ఓ వైఫై వాల్పేపర్నే తయారు చేశారు అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోని మన ఇండియన్ రీసెర్చర్లు. దాని పేరు ‘ఆర్ఫోకస్’. మామూలుగా అయితే మనం వాడే వైఫైకి చాంతాడంత వైరింగ్ కావాలి. అది పనిచేయాలంటే పవర్ కనెక్షన్ ఇవ్వాలి. కానీ, ఆర్ఫోకస్కు అవేవీ అవసరం లేదు. మరి అదెలా పనిచేస్తుంది? అందుకు ఆర్ఫోకస్లో వేలాది చిన్నచిన్న వైర్లెస్ యాంటెన్నాలను ఏర్పాటు చేశారు. వాటిని కంట్రోల్ చేసేందుకు ఓ సాఫ్ట్‌వేర్‌ను ప్రోగ్రామ్‌ను రాశారు. ఆ సాఫ్ట్వేర్ ద్వారా యాంటెన్నాలు సిగ్నళ్లను తీసుకుని డివైస్‌లకు అందిస్తుంది. మామూలు వాటితో పోలిస్తే పది రెట్లు ఎక్కువ శక్తిమంతమైన సిగ్నళ్లను ఇది ఇస్తుంది. వివిధ పరికరాలకు సంబంధించిన వందలాది సెన్సర్లను ఇది కనెక్ట్ చేస్తుంది. వైరింగ్, పవర్ వంటివేవీ లేవు కాబట్టి, దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువేనట. ఎంఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌కు చెందిన హరి బాలకృష్ణన్, వెంకట్ అరుణ్ అనే పీహెచ్డీ స్టూడెంట్లు ఈ ఆర్ఫోకస్ను తయారు చేశారు. దీంతో ఇల్లు, ఆఫీసు ఎక్కడైనా ఎక్కువ సంఖ్యలో డివైస్‌లకు మెరుగైన వైఫై ఇవ్వొచ్చని వాళ్లు చెప్పారు. చిన్న నెట్వర్క్ డివైస్‌లకు నెట్ వస్తుందన్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అభివృద్ధి దశలోనే ఉందని, పూర్తయితే వైఫై, 5జీ సిగ్నళ్లు మరింత మెరుగవుతాయని అన్నారు.
గోడకు అంటించే వాల్ పేపర్లు..వైఫై గా మారిపోతే
- టెక్నాలజి
- February 7, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఢిల్లీలోని ఓ స్వీట్ షాపులో పేలుడు : పోలీసుల హై అలర్ట్
- ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు
- ప్రధాని మోడీని చంపుతానంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్
- OTT Telugu Movies: ఇవాళ (Nov28) ఓటీటీకి వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడలంటే?
- ఫుడ్ క్వాలిటీపై కలెక్టర్ చైర్‌పర్సన్‌గా కమిటీలు.. ఆరేండ్లలో వేల మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు
- ఈ తుఫాన్ ఏదో తేడాగా ఉందే.. 6 గంటల్లో 2 కిలోమీటర్లు మాత్రమే కదిలింది.. తీరం దాటేది ఎప్పుడంటే..!
- Allu Arjun: నేను, నా ఫ్యాన్స్ తగ్గేదేలే.. ఇకపై విరామం లేకుండా సినిమాలు చేస్తా
- సూర్యాపేట జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట నిరసన.. ఎందుకంటే
- Pushpa2TheRule: పుష్ప-2 సెన్సార్, రన్ టైమ్ వివరాలు.. వారు మాత్రం పేరెంట్స్‌తో కలిసి చూడాలి!
- బీజేపీలో చేరితే.. నాపై బ్యాన్ ఎత్తేస్తారు: నాడా సస్పెన్షన్ పై బజరంగ్ సంచలన వ్యాఖ్యలు
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- Syed Mushtaq Ali Trophy: వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. 28 బంతుల్లో సెంచరీ
- చెత్తలో రూ.5వేల 900 కోట్లు.. ఎప్పుడు బయట పడతాయో మరి..!
- Black Friday:బ్లాక్ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి బాగా వినపడుతోంది.. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అంటే..?
- కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు.. జగిత్యాలలో దారుణం
- NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం