టైటిల్ : ది స్మైల్ మ్యాన్,
ఫ్లాట్ ఫాం: ఆహా,
డైరెక్షన్: శ్యామ్-ప్రవీణ్,
కాస్ట్: శరత్ కుమార్, ఇనేయ, సురేష్ చంద్ర మీనన్, శ్రీకుమార్, సీజా రోజ్, రాజ్కుమార్, జార్జ్ మరియన్, కుమార్ నటరాజన్, బేబీ ఆజియా
కథ ఏమిటంటే..?
చిదంబరం నెడుమారన్ (శరత్ కుమార్) సీబీసీఐడీ ఆఫీసర్గా పనిచే ఒస్తుంటాడు. ఒక అనుకోని ప్రమాదం వల్ల అతనికి అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. డాక్టర్లు ఒక సంవత్సరంలో అతని జ్ఞాపకాలన్నీ పూర్తిగా మర్చిపోతాడని చెప్తారు. దాంతో అతను అప్పటివరకు భేదించిన కేసుల వివరాలతో ఒక బుక్ రాస్తాడు.
అయితే.. అందులో 'ది స్మైల్ మ్యాన్' (ఒక సైకో వరుస హత్యలు చేస్తుంటాడు) కేసు గురించి మాత్రం సగమే రాస్తాడు. ఎందుకంటే.. ఈ కేసులో నిందితుడిని వెంబడిస్తున్నప్పుడే చిదంబరానికి ప్రమాదం జరుగుతుంది.
అతను కొన్నాళ్లకు అంతా మర్చిపోయి తన కొత్త లైఫ్ స్టయిల్ కి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడే స్మైల్ మ్యాన్ మళ్లీ హత్యలు చేయడం మొదలుపె చతాడు. దాంతో చిదంబరం మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెదతాడు. కానీ.. అతని మతిమరుపుతో ఆ కేసును సాల్వ్ చేశాడా? నిందితుడిని పట్టుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.
ALSO READ | First Interactive Story: కథని ఇలా కూడా చెప్పొచ్చా? తెలుగులో ఒక కొత్త ఒరవడి, దేశంలోనే మొట్టమొదటి సారి!
క్రైం థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా ఊహించలేని కథ, ట్విస్టులు, బోర్ కొట్టని స్క్రీన్ ప్లే వంటివి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మంచి పాప్ కార్న్ పక్కన పెట్టుకుని సినిమా చూస్తూ సరదాగా సండే ని ఎంజాయ్ చెయ్యండి.