జగిత్యాల టౌన్,వెలుగు: భార్యాభర్తల గొడవలో అడ్డువెళ్లిన అత్తపై అల్లుడు దాడి చేసిన ఘటన జగిత్యాల పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సంతోష్ నగర్ కు చెందిన తిప్పర్తి శ్రీజతో శ్రీధర్ కు 10 ఏళ్ల క్రితం పెండ్లయింది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో శ్రీజ భర్తకు దూరంగా ఆర్మూర్ లో నివాసముంటోంది. ఇటీవల శ్రీధర్ అక్కడికి వెళ్లి కూడా భార్యతో గొడవపడడంతో ఆర్మూర్‌లో కేసు ఫైల్అయింది.
మూడు రోజుల క్రితం శ్రీజ జగిత్యాలలో తల్లి వద్దకు రాగా విషయం తెలుసుకున్న శ్రీధర్ గురువారం అత్తగారింటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో అడ్డు వచ్చిన అత్తపై దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.