మద్యం మత్తులో గొడవ మామ దాడి.. అల్లుడు మృతి

మియాపూర్, వెలుగు : మద్యం మత్తులో మామ దాడి చేయగా అల్లుడు మృతిచెందాడు. మియాపూర్​పోలీసులు తెలిపిన ప్రకారం.. చత్తీస్​ఘడ్​కు చెందిన అరవింద్​సింగ్ అల్లుడు మాన్​సింగ్(21)తో కలిసి మియాపూర్​కల్వరీ టెంపుల్​రోడ్డు లేబర్​అడ్డాలో ఉంటూ వర్క్స్​చేస్తుంటారు. ఈనెల 8న అర్ధరాత్రి ఇద్దరూ మద్యం తాగి గొడవ పడ్డారు. మత్తులో అరవింద్ సింగ్ తన చేతి కడియంతో మాన్​సింగ్​పై దాడి చేశాడు. 

దీంతో అతడి చెవులు, ముక్కులోంచి రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి పోయాడు. స్థానికులు చూసి గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మాన్​సింగ్​గురువారం రాత్రి చనిపోయాడు. మృతుడి బంధువు కంప్లయింట్ చేయగా నిందితుడు అరవింద్​సింగ్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.